వెన్నుపోటు పాలనపై వైసీపీ నిరసన.. మేనిఫెస్టో దహనం

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమ్మడి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిందని, సంక్షేమం, అభివృద్ధి హామీలు అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతో పాటు అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్