నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. విగ్రహం తలను వేరు చేసి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ దుర్మార్గమైన చర్యను ఖండిస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.