గోరుకల్లు: ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని గడ్డివాము దగ్ధం

పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో ఆదివారం ఓబులేసు అనే వ్యక్తికి చెందిన గడ్డివాము ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని అగ్నికి ఆహుతి అయ్యింది. స్థానికుల సమాచారం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంటలు మరింత వ్యాపించకుండా స్థానికులు తీవ్రంగా శ్రమించి అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్