కల్లూరు అర్బన్ పరిధిలోని సెరీన్ నగర్ 29వ వార్డులోని నేషనల్ మెడికల్ షాప్ పక్కన ఉన్న డ్రైన్స్ త్వరగా పూర్తి చేయాలని, 30వ వార్డు శ్రీఆంజనేయస్వామి పక్కన సీసీరోడ్లు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం యేసు రాజు, మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, రోడ్లపై నీరు నిలిచిపోతూ దోమలు, డెంగు, మలేరియా వ్యాప్తి చెందుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం లేకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.