పాణ్యం మండలం ఆలమూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో జనార్దన్ రెడ్డి గురువారం సందర్శించి, తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులు ఇష్టంతో చదవాలని సూచించారు. పాఠశాల వసతులపై అడిగి తెలుసుకుని, పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని సూచించారు. ఉపాధ్యాయుల బాగోగులపై చర్చించి, మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమంపై చర్చించారు. క్లాస్ రూమ్స్ సమస్యపై త్వరలో ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.