పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ కాలువకు సాగు నీటిని విడుదల చేశారు. సోమవారం పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జలవనరుల శాఖ అధికారులతో కలిసి గోరుకల్లు రిజర్వాయర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.