పాణ్యం: ఏరువాక వేడుకల్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నంద్యాలలోని ఆర్‌ఏఆర్‌ఎస్ కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి భూమాతకు పూజలు చేసి, ఎద్దులతో నాగలి దున్నారు. అనంతరం రైతులకు విత్తనాల కిట్లు పంపిణీ చేసి, ఖరీఫ్ సాగు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్