చిన్నటేకూరులో రైతన్నా–మీకోసం పంచసూత్ర అవగాహన కార్యక్రమం

కల్లూరు మండలం చిన్నటేకూరులో సోమవారం జరిగిన 'రైతన్నా–మీకోసం' కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. రైతుల ఇళ్లను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతు అనే పంచసూత్రాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్