పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన రైతు ఓబులేశు గడ్డివాము ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో రైతు ఓబులేశుకు సుమారు రూ. 1. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సోమవారం ఈ ఘటనను తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, రైతును పరామర్శించారు. ప్రభుత్వం ముందు సమస్యను తీసుకెళ్లి న్యాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.