జర్నలిస్టులకు ఆర్థిక భరోసా: 'చైతన్య జ్యోతి' పథకం కింద రూ. 1.84 లక్షల సాయం

నంద్యాలలో సామాజిక సేవకుడు గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో 'చైతన్య జ్యోతి' పథకం రెండో విడత కింద ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు రూ. 1.84 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, జర్నలిస్టుల ఇబ్బందులను గమనించి రాజేష్ ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు, యోగా గురువు ఖండే ఆనంద్ గురూజీ పేర్కొన్నారు. కేవలం ఒక్క రూపాయికే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్న రాజేష్, కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నారని వక్తలు కొనియాడారు. ఈ పథకం ద్వారా నిత్యం ప్రజా సమస్యలపై కలం పట్టి పోరాడే జర్నలిస్టుల కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్