కల్లూరు మండలం లక్ష్మీపురం స్కందాన్షి వెంచర్ కు చెందిన బాలుడు టి. మోక్షిత్ (9) గురువారం అదృశ్యమయ్యాడు. నాల్గవ తరగతి చదువుతున్న మోక్షిత్, మధ్యాహ్నం భోజనం చేసి స్కూల్‌కు వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం 5. 30 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి స్కూల్ వద్ద విచారించగా, అతడు రాలేదని తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏఎస్ఐ విజయరాజు తెలిపారు.