గడివేముల మండలంలోని ఎల్‌కే తండా గ్రామానికి చెందిన నిర్మల బాయి (21) అత్తమామల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భర్త శ్రీకాంత్ నాయక్ ఆమె బంగారం తీసుకుని రుణం తీసుకున్నప్పటికీ విడిపించకపోవడం, కుటుంబ సభ్యుల వేధింపులు కారణమని ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.