పాణ్యం పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ రెడ్డి బృందం పాణ్యం స్టీల్ ప్లాంట్ వద్ద ముల్లా వసీం అక్రమ్, లంకా అలెగ్జాండర్, బూరుగుల మనోహర్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 3 సెల్‌ఫోన్లు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, నంద్యాల కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.