ప్రజలకు అందాల్సిన పథకాలను తెలివిగా కొర్రీ పెడుతూ మోసపూరిత వాగ్ధానాలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విమర్శించారు. సోమవారం హోళగుందలో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల పెంపు, ఉపాధి వాహనాలను సాకుగా చూపుతూ అర్హులను పథకాలకు అనర్హులుగా మారుస్తున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పథకం కొందరికి నిలిపివేయడమే ప్రభుత్వ అసలు మొహాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.