గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలో 4 నెలల క్రితం మిస్సింగ్ అయిన వినోద్ కుమార్ కేసులో శుక్రవారం ఏఎస్పీ మందజావలి పర్యవేక్షణలో పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో లభిస్తున్న ఆధారాల మేరకు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతని చివరి స్థానం, ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ పరిశీలనతో పాటు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మద్దిలేరు వాగులో ద్విచక్రవాహనాన్ని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.