స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లూరు అర్బన్ పరిధిలోని 33వ వార్డులో ప్రచారం నిర్వహించారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, శ్రీనివాసులు కరపత్రాలు పంపిణీ చేసి, స్మార్ట్ మీటర్ల వల్ల పెరిగే విద్యుత్ చార్జీలపై ప్రజలను అవగాహన కల్పించారు. ఈనెల 14న ఎస్సీ విద్యుత్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.