కల్లూరు: సహజ వ్యవసాయానికి బయో రిసోర్స్ సెంటర్లు కీలకం

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో బయో రిసోర్స్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లెలో సహజ వ్యవసాయం జాతీయ మిషన్ సహకారంతో ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్‌ను ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఆమె ప్రారంభించారు. జీవామృతం వంటి సహజ ఎరువుల వాడకం వల్ల ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, రైతులు రసాయనాలపై ఆధారపడకుండా సహజ పద్ధతులు అవలంబించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్