కల్లూరు మండలం ముజఫర్‌నగర్ టీ. నరసింహయ్య స్మారక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం బాలబాలికల కోసం పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథి డా. కె. బడే సాహెబ్ మాట్లాడుతూ పిల్లల్లో లైబ్రరీ అలవాటు మేధస్సును పెంచుతుందని, అంబేద్కర్, కారల్ మార్క్స్ వంటి మహనీయులు లైబ్రరీల ద్వారా ప్రపంచంపై ప్రభావం చూపారని పేర్కొన్నారు. కార్యదర్శి ఆజాద్ లైబ్రరీని విజ్ఞాన భాండాగారంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.