కల్లూరు: సమాజంలో మానవత్వం పెంచాలని సీపీఎం నేత పిలుపు

సమాజంలో మానవత్వాన్ని పెంపొందించాలని సీపీఎం నగర నాయకుడు జి. యేసు రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం కల్లూరులో ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల సమయంలో నిర్లక్ష్యం వదిలి, బాధితులకు లింగభేదం లేకుండా వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి సహాయం చేయడం ప్రతి పౌరుడి కర్తవ్యమని అన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుండి సేవ చేస్తున్నారని, అందరూ మానవత్వంతో వ్యవహరిస్తేనే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్