పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామం, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ రైతులకు గురువారం 80% రాయితీతో రూ. 9. 8 లక్షల విలువగల కిసాన్ డ్రోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రైతులకు నూతన సాంకేతికత వినియోగించడం ద్వారా సమయాన్ని, ఖర్చులను తగ్గించేందుకు ప్రోత్సాహం ఇచ్చారు. వ్యవసాయశాఖ అధికారులు, గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.