పాణ్యం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మొత్తం రూ. 17,98,047 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి సోమవారం కల్లూరులోని తన కార్యాలయంలో పంపిణీ చేశారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ. 8 లక్షలు, కే. భూపాల్ ఆచారికి రూ. 6,36,340, సులోచనమ్మ కుటుంబానికి రూ. 3,61,707 చొప్పున చెక్కులు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.