కల్లూరు మండలంలోని ఏ. గోకులపాడు గ్రామంలో శనివారం ఎస్సీ కాలానికి చెందిన 30 మంది అర్హులకు 1. 50 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వారు ఎమ్మెల్యేకు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు లక్ష్మీవరద రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, రమణ రెడ్డి, బీజేపీ నాయకుడు సోమశేఖర రెడ్డి, టి. రాజు తదితరులు పాల్గొన్నారు.