కర్నూలు వైసీపీ నాయకులు ఎస్వీమోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదివారం మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక ఆధ్వర్యంలో కర్నూలులో సమావేశం నిర్వహించారు. కర్నూలులో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, మున్సిపల్ వర్కర్లు 57 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారని వారు ఆరోపించారు.