నంద్యాల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి రాష్ట్ర టీడీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమై ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువతను మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.