కొండా వెంకట రంగారెడ్డి జయంతి: డోన్‌లో ఘన నివాళి

డిశంబర్ 12న స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకట రంగారెడ్డి జయంతి సందర్భంగా డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఫి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులు, శాస్త్రవేత్తలు, మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. కొండా వెంకట రంగారెడ్డి ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాదు మండలం, పెద్దమంగళారం గ్రామంలో 1890, డిసెంబరు 12న జన్మించారు. ఆయన ప్రజా సేవలో స్త్రీలకు వారసత్వపు హక్కు, బాల్య వివాహ నిర్మూలన, పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు కృషి చేశారు. 1940 వరకు న్యాయవాదిగా పనిచేసి పేద ప్రజలకు సేవలందించారు. ఆయన జ్ఞాపకార్థం 1978, ఆగస్టు 15న ఏర్పడిన జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టారు.

సంబంధిత పోస్ట్