కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన ఉమాదేవి అనే మహిళ తన రెండున్నరేళ్ల కుమారుడు యశ్వంత్ రెడ్డితో సహా అదృశ్యం అయ్యింది. శుక్రవారం ఎస్సై హనుమంత రెడ్డి సమాచారం మేరకు జూలై 9న కోసిగి రైల్వే స్టేషన్‌కు చేరుకుని చెన్నై మెయిల్ ఎక్కినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు 9121101154, 9121101155కి తెలపాలన్నారు.