కర్నూలు: జూన్ 5న విస్తృతంగా మొక్కల నాటకం చేపట్టాలి

కర్నూలు జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వసతి గృహాలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్‌ల ఏర్పాటుపై చర్చించారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు చేసి పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచాలని, మియావాకి విధానంలో హైడెన్సిటీ ప్లాంటేషన్ చేపట్టి వేలాది మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్