కర్నూలు: జిల్లాలో రూ. 104. 06 కోట్ల ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ

కర్నూలు జిల్లాలో జూన్ మాసానికి సంబంధించి అర్హులైన 2,34,764 మంది లబ్ధిదారులకు రూ.104.06 కోట్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. సోమవారం దేవనగర్ కాలనీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని వికలాంగ, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రతి నెలా సమయానికి పెన్షన్లు అందుతున్నాయా అని ఆరా తీశారు. చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. పెన్షన్ పంపిణీ తొలి రోజే 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్