కర్నూలు: ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకిపోయేలా చూడాలి

ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకిపోయేలా చూడటమే "నీటి భద్రత" పథకం ప్రధాన ఉద్దేశ్యమని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, భూగర్భ జలాలను పెంచేందుకు బోర్‌వెల్స్, చెరువులు, కాలువలు మరమ్మత్తులు చేయాలని సూచించారు. పాత చెరువులు, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరించి, నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్