కర్నూలు జిల్లా అభివృద్ధికి పరిశ్రమలే పునాది అని, తలసరి ఆదాయం పెంచేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో, ఎంఎస్ఎంఈల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చి తలసరి ఆదాయం పెంచాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 35 ఎంఓయూలలో 11 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయని, పరిశ్రమలకు రూ. 68. 88 లక్షల ఇన్సెంటివ్లు అందించినట్లు వెల్లడించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.