కర్నూలు: ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్

గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ, బడుగు, బలహీన, పేద వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఎదిగి, ఆపై ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మనసులు గెలుచుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్