కర్నూలు: ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారుల విఫలం

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. మంగళవారం స్థానిక కెకె భవన్‌లో జరిగిన సంఘం కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు మండల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో వేలాది మంది పేదలు సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారని తెలిపారు. మరికొన్ని చోట్ల పనులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నారని, ఈ నేపథ్యంలో ఆస్పరి మండలం పుటకలమర్రిలో పేదలు పనుల కోసం వెళుతున్న ఆటో బోల్తా పడి 43 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్