కర్నూలు: అల్లూరి సీతారామరాజు వర్ధంతికి ఘన నివాళులు

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశ సేవలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన ధీశాలి అల్లూరి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్