ఆదివారం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని అరుణా థియేటర్ ఎదురుగా ఉన్న దావూద్ కిచిడి హోటల్‌లో చిన్న వివాదం ఘర్షణకు దారితీసి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు పొగాకు తీసుకుని వెళ్తుండగా, హోటల్ వద్ద కిచిడి తిని సోంపు అడగడంతో యజమానితో వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రమై పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ప్రతాప్ అనే వ్యక్తి తలకు గాయమైంది.