కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యల్. పి. జి. ఫిల్లింగ్ ప్లాంటులో గురువారం యల్. పి. జి లీక్ అగ్నిప్రమాదం విపత్తు ఆన్-సైట్ మాక్ డ్రిల్లు నిర్వహించారు. కర్నూలు ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇనస్పెక్టర్ ఐ. నారాయణ రెడ్డి, అగ్నిమాపక అధికారి వై. చిన్న బజారి నేతృత్వంలో నిర్వహించిన ఈ డ్రిల్లు, సిబ్బంది ప్రవర్తన, మంటలను అరికట్టడంపై అవగాహన కల్పించారు.