స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రభుత్వం మానుకోవాలని ఓర్వకల్లు సిపిఎం మండల కార్యదర్శి బి. నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం లొద్దిపల్లె, బైరాపురం గ్రామాల్లో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని, ప్రజలపై ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో వేస్తున్న భారం విరమించుకోవాలన్నారు. 14న ఓర్వకల్లు కరెంటు ఆఫీస్ ముందు ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు.