ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు నుంచి నంద్యాల వైపు ఆర్టీసీ బస్సు లారీ ఢీకోనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.