గడివేముల మండలం గని గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం వైసీపీ నేతలు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణతో పేద వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు మద్దతుగా ప్రజలు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.