కాల్వబుగ్గ ఆలయంలో హుండీ దొంగతనంపై ఎమ్మెల్యే ఆరా

పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ శ్రీబుగ్గ రామేశ్వర స్వామిని సోమవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం అంశంపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆలయ అర్చకులు, ఈవోని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని హుండీలను దొంగలు అపహరించిన ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే, దొంగలను త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.

సంబంధిత పోస్ట్