కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 36, 37, 41వ వార్డుల వీకర్ సెక్షన్ కాలనీలో పాత పైప్లైన్ల చిల్లులు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది. పార్టీ నాయకులు టి. రాముడు, ఎన్. అలివేలమ్మ పాత పైప్లైన్ స్థానంలో కొత్త పైప్లైన్ నిర్మించాలన్న డిమాండ్ చేశారు. మురికి నీరు కలిసే ప్రమాదం ఉన్నందున, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు.