కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. బుధవారం ఆమె కేంద్ర మంత్రితో మాట్లాడుతూ, ఈనెల 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా విమానాశ్రయానికి ఆ పేరును అధికారికంగా ప్రకటించాలని కోరారు.