ఓర్వకల్లు మండలంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై బుధవారం బొలేరో పికప్ వాహనం యూటర్న్ తీసుకుంటూ డీవైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన డ్రైవర్ గజ్జలకొండ వేణు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కడప నుంచి హైదరాబాదు వెళ్ళే ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.