ఓర్వకల్: మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించండి

కన్నతల్లి, జన్మభూమి రుణాన్ని తీర్చుకునేందుకు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని ఓర్వకల్ మండల పరిధిలోని శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మిస్ట్రీస్ కమతం సునీత కోరారు. శుక్రవారం ఆమె విద్యార్థులందరికీ ఒక్కో మొక్కను అందజేసి వారి పేర్లను గ్రీన్ పాస్పోర్టులో నమోదు చేసుకున్నారు. విద్యార్థులందరూ ప్రతిరోజు మొక్కలను సంరక్షిస్తూ వాటిని పెంచాలని కోరారు.

సంబంధిత పోస్ట్