ఓర్వకల్ మండల పరిధిలోని శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ పీపుల్ లీడర్ ఎస్. శ్రావణి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో 50 ఓట్లతో ఆమె ఎస్. పి. ఎల్. గెలుపొందారు. 49 ఓట్లతో మదన్ ఏ. ఎస్. పి. ఎల్ గా గెలుపొందాడు. 45 ఓట్ల తో చిన్న రాముడు మూడో స్థానంలో నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సునీత ఆధ్వర్యంలో జనరల్ ఎలక్షన్స్ నూ తలపించేలా ఎన్నికలు నిర్వహించారు.