ఓర్వకల్లు: ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

ఓర్వకల్లు మండలంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ముందస్తు అడ్మిషన్లు, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక వసతుల కొరతపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్‌వీఎఫ్), ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు ఎమ్మార్వో విద్యాసాగర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు. అక్రమ ఫీజుల వసూళ్లను అరికట్టి, నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్