ఓర్వకల్లు: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత ప్రారంభం

ఓర్వకల్లు మండలం ఎంపిడివో కార్యాలయంలో బుధవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడతలో భాగంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ. 3135.01 కోట్లు జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000, కేంద్రం రూ. 6,000 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్