ఓర్వకల్లు: కారు ఢీకొని ఇంజినీరింగ్ అసిస్టెంట్ మృతి

ఓర్వకల్లు మండలంలోని కర్నూలు–కడప జాతీయ రహదారిపై రాక్ గార్డెన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నమడకల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ రంగస్వామి (33) దుర్మరణం చెందారు. విధులు ముగించుకుని కర్నూలుకు తిరిగి వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన కారు రంగస్వామి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రంగస్వామి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్