ఓర్వకల్లు: రైతులకు సూక్ష్మ పోషకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఓర్వకల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రైతులకు సూక్ష్మ పోషకాల పంపిణీ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, సూక్ష్మ పోషకాల వినియోగంతో పంట దిగుబడులు మెరుగుపడతాయని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్