బుధవారం ఓర్వకల్లు మండల కేంద్రంలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. తాహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అనంతరం, జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సందీప్ కుమార్, ఎస్సై సునీల్ కుమార్ లకు వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా వి. కోట మండలంలో జరిగిన ఈ దారుణ హత్యపై నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి శ్రీధర్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.