రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగింపు పథకం రద్దు చేయాలని సిపిఎం నాయకులు హెచ్చరించారు. సోమవారం ఓర్వకల్లు సిపిఎం మండల కమిటీ మధుసూదన్ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు బిగించే విధానానికి వ్యతిరేకంగా ధర్నా జరిగింది. జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలపై వేసిన చార్జీలను తగ్గించని ప్రభుత్వం తీరును విమర్శించారు. మేనిఫెస్టో హామీలను జారీ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.